ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ వెళ్తున్న స్కార్పియో వాహనం.. పోలీసులు ఆపుతున్నా ఆగకపోవడంతో..

ABN, First Publish Date - 2020-07-13T16:15:10+05:30

నల్లగొండ జిల్లా నకిరేకల్‌ శివారు 65వ జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్న ఓ వాహనంలో రెండు కిలోల గంజాయిని పోలీసులు ఆదివా రం పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు కిలోల గంజాయి పట్టివేత


నకిరేకల్‌ (నల్లగొండ): నల్లగొండ జిల్లా నకిరేకల్‌ శివారు 65వ జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్న ఓ వాహనంలో రెండు కిలోల గంజాయిని పోలీసులు ఆదివా రం పట్టుకున్నారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం సాయంత్రం నకిరేకల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై నకిరేకల్‌ సీఐ బాలగోపాల్‌, ఎస్‌ శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా, విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన స్కార్పియో వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు దాన్ని వెంబడించి చందంపల్లి స్టేజీ వద్ద పట్టుకున్నారు. 


మహారాష్ట్రకు చెందిన పంబ్సు సాహెబ్‌ భాస్కర్‌, అనికెట్‌ అర్జున్‌చౌదరి, వా ల్మిక్‌ నామ్‌దేవ్‌చౌహన్‌, సచిన్‌ జంగార్‌ అనే వ్యక్తులు అనకాపల్లి దగ్గర గంజాయి కొనుగోలు చేసి వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకోగా, వాల్మిక్‌ నామ్‌దేవ్‌చౌహన్‌, సచిన్‌జంగార్‌ కొన్ని గంజాయి ప్యాకెట్లు తీసుకొని పారిపోయారు. వాహనంలో 2కిలోల తూకం ఉన్న 40 ప్యాకెట్ల గంజాయి దొరికింది. దీని విలువ రూ.8లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పట్టుబడ్డ నిందితులు పంబ్సు సాహెబ్‌ భాస్కర్‌, అనికెట్‌ అర్జున్‌చౌదరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపామని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ బాలగోపాల్‌, ఎస్సై శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-13T16:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising