ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత

ABN, First Publish Date - 2020-12-01T12:16:49+05:30

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. 1956 జనవరి 9న నోముల జన్మించారు. 2014లో సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో  చేరిన ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జానారెడ్డిపై విజయం సాధించారు. 1999, 2004లో నకిరేకల్ ఎమ్మెల్యేగా నోములు గెలుపొందారు. నోముల నర్సింహయ్య మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2020-12-01T12:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising