ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

ABN, First Publish Date - 2020-12-31T04:35:32+05:30

రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు.

బీబీనగర్‌ చెరువులో రొయ్యపిల్లలు వదులుతున్న జడ్పీ చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి 

బీబీనగర్‌, డిసెంబరు 30: రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్‌ పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రొయ్య పిల్లలను చెరువులోకి వదిలారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ఈఏడాది అధిక వర్షపాతంతో చెరువులు, కుంటలు పూర్తిగా నిండుకొని ఉన్నందున వాటిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార్మిక సొసైటీలకు ప్రభుత్వం ఉచితంగా చేప, రొయ్య పిల్లల్ని పంపిణీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, మత్స్యశాఖ సహాయ సంచాలకులు శంకర్‌, రాథోడ్‌, డీఎ్‌ఫవో షకీలాభాను, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, జడ్పీటీసీ గోలి ప్రణితా పింగల్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లగారి భాగ్యలక్ష్మీ శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ దస్తగిరి, నాయకులు మహేశ్‌గౌడ్‌, అక్బర్‌, లక్ష్మీనారాయణ, సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising