ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరవేగంగా థర్మల్‌ పనులు

ABN, First Publish Date - 2020-06-02T09:30:29+05:30

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో తలపెట్టిన యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దామరచర్ల: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో తలపెట్టిన యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ కోతల నివారణలో భాగంగా 2015 జూలై 8న సీఎం కేసీఆర్‌ పైలాన్‌ ఆవిష్కరించి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అనంతరం పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణను అధికారులు చేప ట్టి పూర్తిచేశారు. అటవీ, పట్టా, ఉడా్‌ఫలతో పాటు వివిధ పట్టాలు కలిగిన 4676ఎకరాల భూమి తక్కు వ వ్యవధిలో నే సేకరించా రు. పరిశ్రమ కు సరిపడా భూమి, పక్క నుంచే కృష్ణానది ప్రవాహం, రైలు, రహదారి మార్గం అన్నీ ఒకే చోట ఉండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.


సుమారు రూ.30 వేల కోట్ల వ్యయం తో (ఐడీసీతో సహా) మొత్తం 4వేల మెగావాట్ల సామర్థ్యంతో ఒక్కోటి 800 మెగావాట్ల బొగ్గు ఆధారిత సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ఐదు యూనిట్లను యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమ పేరుతో నిర్మించేందుకు పనులు కొనసాగుతున్నాయి. సదరు నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు రూ. 20,379కోట్ల కు పనులను టీఎస్‌ జెన్‌కో అప్పగించింది. పర్యావరణ అనుమతులకు సైతం కేంద్రం ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం పనుల్లో వేగాన్ని పెంచింది. పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటి వరకు సుమారు రూ.8వేల కోట్ల పైచిలుకు నిధులు ప్రభు త్వం విడుదల చేసింది. ఈ పరిశ్రమకు గాను యేడాదికి 12.29మిలియన్‌ టన్నుల బొగ్గు, కృష్ణానది నుంచి 6.5టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. పరిశ్రమ పనులు 2023వరకు పూర్తి చేసే దిశగా పనుల్లో వేగం పెంచింది.

Updated Date - 2020-06-02T09:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising