ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ముంచిన ఈదురుగాలుల వర్షం

ABN, First Publish Date - 2020-04-09T11:04:29+05:30

అకాల వర్షం యాదాద్రిభువనగిరి జిల్లా రైతులను వెంటాడుతోంది. బుధవారం సాయంత్రం జిల్లాలోని యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, చౌటుప్పల్‌, బీబీనగర్‌ మండలాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. యాదగిరిగుట్ట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేలరాలిన ధాన్యం, తడిసిన ధాన్యం రాశులు


యాదాద్రి(ఆంధ్రజ్యోతి), భువనగిరి/ ఆలేరు/ మోటకొండూరు/ యాదాద్రిరూరల్‌/ తుర్కపల్లి / చౌ టుప్పల్‌ టౌన్‌ / చౌటుప్పల్‌ రూరల్‌ / మునుగోడు / మర్రిగూడ / రాజాపేట ఏప్రిల్‌8 :  అకాల వర్షం యాదాద్రిభువనగిరి జిల్లా రైతులను వెంటాడుతోంది.  బుధవారం సాయంత్రం జిల్లాలోని యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, చౌటుప్పల్‌, బీబీనగర్‌ మండలాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో భారీగా వడగండ్లు కురిశాయి. దీంతో పొలాల్లో ధాన్యం నేలరాలి తీవ్రనష్టం వాటిల్లింది. సైదాపురం, మాసాయిపేట గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. తుర్కపల్లి మండలం దత్తాయపల్లి, వేల్పుపల్లి, వెంకటాపురంలో స్వలంగా వడగండ్లు కురిసాయి.


భువనగిరి మండలంలోని బొల్లేపల్లి, నందనం, నాగిరెడ్డిపల్లి, వీరవెల్లి, చందుపట్ల, సూరెపల్లి, బస్వాపురం గ్రామాల్లో వర్షం కురిసింది. దాదాపు మండల వ్యాప్తంగా 250 ఎకరాల్లో వరి పైరు దెబ్బతిన్నట్లు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. చౌటుప్పల్‌ మండలంలో ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురవగా వరిపైరు దెబ్బతింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. పోచంపల్లి, బీబీనగర్‌, ఆలేరు, మోటకొండూరు, రాజాపేట మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.


అకాల వర్షంతో పంట నష్టపోయినన  రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యం కొనుగోల్లు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మునుగోడు, మర్రిగూడ మండలాల్లో వర్షంతో నష్టపోయిన పంటలను అధికారులు, నాయకులు పరిశీలించారు. రాజాపేట మండలంలోని నెమిల, పారుపల్లి, సోమవారం బొందుగుల గ్రామాల్లో వడగండ్లతో దెబ్బతిన్న పంటలను బుధవారం భువనగిరి ఆర్డీఓ ఎంవీ.భూపాల్‌రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించారు. 

Updated Date - 2020-04-09T11:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising