ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి

ABN, First Publish Date - 2020-09-12T09:40:34+05:30

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిండి / నల్లగొండ రూరల్‌, సెప్టెంబరు 11 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన డిండి మండలంలోని అమరవీరుల స్థూప్తం వద్ద మాజీ ఎమ్మెల్యే బొడ్డుపల్లి రామశర్మ, ఎండీ.బంధగి, ఎలిమినేటి పెద్దయ్య, కృష్ణశర్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాన్ని ఇప్పటి తరాలకు తెలియజేసేందుకు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


కార్యక్రమంలో వెంకటరమణ, బుచ్చిరెడ్డి, ఎండి.మైనోద్దీన్‌, ఎస్‌ఆర్‌.కనకచారి, శైలేజ్‌, కేశవులు, వెంకటేశ్వర్లు, సలీం, సైదులు, సుందరమ్మ, సాగర్‌, ప్రేమ్‌ పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రావినారాయణరెడ్డి, మగ్దూం మొహినొద్దీన్‌, బద్దం ఎల్లారెడ్డి చిత్రపటాలకు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం పూల మాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రవణ్‌కుమార్‌, దేవేందర్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి రమేష్‌, లెనిన్‌, ముత్యాలు, యాదగిరి, యూసుఫ్‌, మదర్‌ రామ్‌కోటి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-12T09:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising