చెక్‌డ్యాం నిర్మాణంతో తొలగనున్న రైతుల కష్టాలు
ABN, First Publish Date - 2020-12-31T04:38:37+05:30
చెక్‌డ్యాం నిర్మాణంతో రైతుల ఇబ్బందులు తొలుగుతాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ రూరల్, డిసెంబరు 30: చెక్‌డ్యాం నిర్మాణంతో రైతుల ఇబ్బందులు తొలుగుతాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని రెడ్లకుంటలో రూ. 3.50కోట్లతో పాలేరు వాగుపై ని ర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. చేశారు. రెడ్లకుంట గ్రామం సాగర్‌ఎడమ కాల్వ చివరి ప్రాంతంగా ఉన్నందున రైతులు వేసిన పంట చేతికివస్తుందో లేదో అనే అను మానం ఉండేదన్నారు. అనేకసార్లు సాగర్‌ఎడమ కాల్వకు నీరు వది లినా రెడ్లకుంట వరకు నీరురాక అనేక పర్యాయాలు పంటలు ఎండిపో యిన పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవితారెడ్డి, జడ్పీ టీసీ కృష్ణకుమారి, సర్పంచ్ సాతినేని లీలా, వైస్ ఎంపీపీ మల్లెల రాణి, మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్‌గౌడ్, పుల్లయ్య పాల్గొన్నారు.
Updated Date - 2020-12-31T04:38:37+05:30 IST