తవ్వితే వెలుగులోకి అక్రమాలు
ABN, First Publish Date - 2020-03-16T12:20:17+05:30
కంది పంటను సాగు చేసిన రైతులకు మేలు కోసం ప్రభు త్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాలు బడా వ్యాపారులకు అడ్డగా మారిపోయాయి.
సూర్యాపేట సిటీ, మార్చి 15 : కంది పంటను సాగు చేసిన రైతులకు మేలు కోసం ప్రభు త్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాలు బడా వ్యాపారులకు అడ్డగా మారిపోయాయి. రైతుల ముసుగులో వ్యాపారులు కేంద్రాల్లో కందులు విక్రయించి లాభా లు పొందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులు కందులు విక్రయించకుండా ఉం డేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఫలి తం లేకపోయింది. క్షేత్రస్థాయిలో పంట సాగు భూమిని పరిశీలించకుండా ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఇద్దరూ ఏఈవోలపై గతంలో వేటు వేసిన వి షయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఉన్న కందుల కొనుగోలు కేంద్రాల్లో విజిలెన్స్ అధికారులు మరోమారు లోతుగా తనిఖీలు చేస్తే రైతుల పేరుతో ఆక్రమంగా పంట ధృవీకరణ పొంది కందుల కొనుగోలు కేంద్రాల్లో కందులను విక్రయించిన వ్యాపారులను గుర్తించే అవకాశముంది.
ఉమ్మడి జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ నోడల్ ఎజెన్సీ అయిన మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఐకేపీ సంస్థల ఆధ్యర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో 10కం దుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, కొండమల్లేపల్లి, పీఏపల్లి వ్యవసాయ మార్కెట్‌లో, యాదాద్రి జిల్లాలో మోత్కూర్, మోటకోండూ ర్, ఆలేరు, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కందుల కొనుగోలు కేంద్రాల్లో కందులను విక్రయించాలంటే పంట ధృవీకరణ పత్రం తప్పనిసరి. అయితే చాలమంది ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పంట ధృవీకరణ పత్రాలను రాసి ఇచ్చారు. దీంతో రైతుల ముసుగులో కొంతమంది వ్యాపారులు కందుల కొనుగోలు కేంద్రాల్లో కందులను విక్రయించారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ కారణంగానే గతంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఏఈవో, నల్లగొండ జిల్లా జీకే.అన్నారం ఏఈవోలపై సస్పెన్షన్ వేటు వేశారు. రైతుల ముసుగులో కొనుగోలు కేంద్రాల్లో కందులు విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించడంలో నిర్వాహకులు విఫలమవుతున్నారు.
పూర్తిగా విఫలం చెందా రు. కందుల కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు గ్రామ వీఆర్‌వో, ఏఈవో సంతకం చేసిన పంట ధృవీకరణ పత్రాలను, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకాలు అన్ని సక్రమంగా ఉండటంతో కందులను కొనుగోలు చేయడం జరుగుతుందని కందుల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తెలియజేస్తున్నారు. పంట విక్రయంకు కావాల్సిన అన్ని పత్రాలు సక్రమంగా ఉండటం వలన వ్యాపారులను గుర్తించడం అసాధ్యం అవుతుందని నిర్వాహకులు అంటున్నారు. అయితే కందుల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వ్యాపారులు తెలిసే ఉంటుందని రైతులు వాపోతున్నారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీలో వెలుగులోకి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల 10 కందుల కొనుగోలు కేం ద్రాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఫిబ్రవరి నెలలో చేపట్టిన తనిఖీల్లో అక్రమాలు వెలుగు చూశా యి. ఏఈవోలు జారీ చేసిన పంట ధృవీకరణ పత్రాల్లో కంది పంటను సాగి చేసినట్లు చూపగా, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించగా ఆ భూముల్లో ఇతర పంటలు సా గు చేసి ఉండటం, పంట ధృవీకరణ పత్రాల్లో పేర్కోన రె ౖతు, క్షేత్రస్థాయిలో మరో రైతు సాగులో ఉండటం వంటి అవకతవలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన కందుల్లో కొంతమేర వ్యాపారులు అమ్మిన కందులు ఉండే అవకాశముంది. మరోమారు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Updated Date - 2020-03-16T12:20:17+05:30 IST