ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలుచేయాలి
ABN, First Publish Date - 2020-12-29T05:25:26+05:30
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బీజేపీ నాయకుల ధర్నా
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌కార్డులు, రుణాలు మంజూరు చే యలేదన్నారు. నేరేడుచర్లలో బీజేపీ నాయకులు పార్ధనబోయిన విజయ్‌కుమార్, ప్రవీణ్, సైదులు, వీరబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో ముస్కుల చంద్రారెడ్డి, లక్ష్మణ్, బాలవెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గరిడేపల్లిలో బీజేపీ నాయ కులు అందె కోటయ్య, ఎడవెల్లి బాటసారి, పోకల వెంకటేశ్వర్లు, బొమ్మ బాల కృష్ణ పాల్గొన్నారు. నడిగూడెంలో దున్నా సతీష్, మాతంగి ఏసుబాబు, వినోద్, ప్రసాద్ పాల్గొన్నారు. మేళ్లచెర్వులో సాముల సైదిరెడ్డి, రామారావు, అశోక్, రాములు ఉన్నారు. కోదాడలో రాధాకృష్ణ, భాగ్యమ్మ, ఏసుపాదం పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T05:25:26+05:30 IST