గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN, First Publish Date - 2020-03-16T12:10:52+05:30
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని
తుంగతుర్తి, మార్చి 15: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని తూర్పుగూడెంలో సీసీరోడ్డుకు శంకుస్థాపన, తూర్పుగూడెంలో చెత్త బుట్టలు పంపిణీ చేశారు. మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి జవాబుదారీతనం పెంచుతున్నామని చెప్పారు. హ రితహారంలో మొక్కలు నాటి పర్యావరణానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఎం పీఆర్వో హజారి రమేష్, ఎంపీడీవో ఫసీఉద్దీన్, ఏపీవో వెంకన్న, డీ సీసీబీ డైరెకర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ శ్రీశైలం, ఉపసర్పంచ్ మహేందర్, తాటికొండ సీతయ్య, రాములుగౌడ్, యాదగిరి, వెంకన్న పాల్గొన్నారు.
Updated Date - 2020-03-16T12:10:52+05:30 IST