ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-12-05T05:53:18+05:30
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లిలో కిరాణా వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చౌటుప్పల్ రూరల్, డిసెంబరు4: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లిలో కిరాణా వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తంగడపల్లికి చెందిన చీకూ రి ప్రకా్‌షగౌడ్(47) కిరాణ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల కిరా ణం వ్యాపారం సక్రమంగా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన ప్రకా్‌షగౌడ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రకా్‌షగౌడ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-05T05:53:18+05:30 IST