ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లీకుమారుల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-12-05T06:06:17+05:30

తల్లీ కుమారులు ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో శుక్రవారం ఆత్మ హత్యాయత్నం చేశారు.

భర్త శ్రీనివాస్‌తో కలిసి అశ్విని, కుమారులు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కుమారులు మృతి... తల్లి క్షేమం 

 నెల్లూరు జిల్లాలో ఘటన

 నేరేడుచర్లలో విషాదఛాయలు

నేరేడుచర్ల, డిసెంబరు4: తల్లీ కుమారులు ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో శుక్రవారం ఆత్మ హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కుమారులు మృతిచెందగా, తల్లికి ప్రాణాపాయం తప్పింది. బంధువులు, నెల్లూరు జిల్లా వింజమూరు ఎస్‌ఐ బాజిరెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లికి చెందిన యామల శ్రీనివా్‌సతో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊట్కూరుకు చెందిన అశ్వని(29)తో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వారికి హేమంత్‌(8), జశ్వంత్‌(6) ఇద్దరు కుమారులు ఉన్నారు. హుజూర్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ ఎనిమిదేళ్ల క్రితం మాడ్గులపల్లి నుంచి నేరేడుచర్లకు వచ్చి జీవనం కొనసాగిస్తున్నాడు. అశ్వని అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమ ంలో నేరేడుచర్లకు వచ్చిన అశ్వని తల్లి కోవి ఆదిలక్ష్మమ్మ ఆరోగ్యం కుదుటపడే వర కూ తన వద్ద ఉంచుకునేందుకు ఈ నెల 3న అశ్వనితో పాటు ఇద్దరు పిల్లలను ఊట్కూకు తీసుకువెళ్లింది. శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న చెరువు గట్టు వద్ద మీద ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుని వస్తానని అశ్వని తన కుమారులతో కలిసి వెళ్లింది. తాను కూడా వస్తానంటూ తల్లి చెప్పినా, ఆమె కంటే ముందే బయలుదేరింది.  అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అశ్వని కుమారులతో కలిసి చెరువులో దూకింది.అంతలోనే కూతురు అశ్వనిని అనుసరిస్తూ వచ్చిన తల్లి ఆదిలక్ష్మమ్మ చెరువు వద్దకు చేరుకునేలోగా అశ్వని చిన్న కుమారుడు జశ్వంత్‌ (6) నీటిలో తేలియాడుతూ కనిపించగా; అశ్వని నీటిలో మునుగుతూ కనిపించింది. పరిసర ప్రాంత ప్రజలకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను బయటకు తీశారు. పెద్దకుమారుడు హేమంత్‌(8) నీటి లో మునిగి మృతి చెందాడు. 

నాతో కలిసే దూకారు : తల్లి అశ్విని

మానసిక స్థితి సరిగా లేకే ఆత్మహత్యకు యత్నించానని తల్లి అశ్వని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. వింజమూరులో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పోలీసులతో మాట్లాడుతూ తమకు ఆర్థిక ఇబ్బందులు లేవని, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని చె ప్పింది. తనతో పాటే కుమారులు కూడా చెరువులో దూకారని చెప్పింది.

నేరేడుచర్లలో విషాదఛాయలు

హుజూర్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో విధుల్లో ఉన్న సమయంలో ఇద్ద రు కుమారుల మృతి సమాచారం తెలుసుకున్న అశ్వని భర్త శ్రీనివాసరావు స్పృహకోల్పోగా, సిబ్బంది వైద్యచికిత్స చేశారు. ఆత్మహత్యాయత్నం ఘటనతో నేరేడుచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.  కుటుంబ సభ్యులు, బంధువులు నేరేడుచర్ల నుంచి బయలుదేరి వెళ్లారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు వింజమూరు ఎస్‌ఐ బాజిరెడ్డి తెలిపారు.  

Updated Date - 2020-12-05T06:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising