ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలి

ABN, First Publish Date - 2020-12-15T06:22:12+05:30

ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని ఎంజీ యూనివర్సిటీలోని రిజిస్ట్రార్‌, పరీక్షల విభాగం ఎదుట విద్యార్థులు సోమవారం ధర్నా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంజీయూలో విద్యార్థుల ధర్నా

నల్లగొండ క్రైం, డిసెంబరు 14: ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని ఎంజీ యూనివర్సిటీలోని రిజిస్ట్రార్‌, పరీక్షల విభాగం ఎదుట విద్యార్థులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ వరకే బీఈడీలో ప్రవేశానికి చివరి గడువు అని, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ అవుతుందని అన్నారు. అయితే ఎంజీయూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బీఈడీలో ప్రవేశానికి అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు ఆందోళన చేసినా యూనివర్సిటీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోగా, ఆ బాధ్యత తమది కాదంటూ రిజిస్ట్రార్‌, పరీక్షల విభాగం అధికారులు దాటవేశారని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి, విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా, ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో తమను కావాలనే ఫెయిల్‌ చేశారనే అనుమానం ఉందని ఫొటో కాపీ కోసం రూ.1000 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రెండు నెలలు గడుస్తున్నా నేటికీ వాటిని ఇవ్వలేదు.

Updated Date - 2020-12-15T06:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising