ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మస్థైర్యంతో సమస్యలను అధిగమించాలి

ABN, First Publish Date - 2020-12-04T05:05:13+05:30

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమస్యలను అధిగమించాలని మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు దేవరాజన్‌ దివ్య అన్నారు.

వెబ్‌నార్‌లో మాట్లాడుతున్న దేవరాజన్‌ దివ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు దేవరాజన్‌ దివ్య 

భువనగిరి టౌన్‌, డిసెంబరు 3: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమస్యలను అధిగమించాలని మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు దేవరాజన్‌ దివ్య అన్నారు. జిల్లా సం క్షేమశాఖ గురువారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఆమె హైదరాబాద్‌ నుంచి వెబ్‌నార్‌లో మాట్లాడారు. ఆర్థిక స్వావలంభన సాధించేందుకు ప్రభుత్వ సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్‌ నేపథ్యంలో వ్యక్తిగత ఆరోగ్యానికి  ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఈ-పాస్‌ వెబ్‌సైట్‌ను ఆమె ఆవిష్కరించారు. కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ మాట్లాడుతూ దివ్యాంగులకోసం జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది స్వచ్ఛంద సంస్థలను గుర్తించామని, అలాగే దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెబ్‌నార్‌లో పాల్గొన్న ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ దివ్యాంగులపట్ల ఔదార్యం చూపాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కేవీ కృష్ణవేణి, డీఆర్‌డీఏ మందడి ఉపేందర్‌రెడ్డి, దివ్యాంగుల సంఘం నాయకులు తె రుపల్లి చక్రధర్‌రెడ్డి, సురిపంగ ప్రకాశ్‌, ధరణి కోట నర్సింహ, ఆకుల ర వి, బాలాజీ, శివకుమార్‌, ప్రవీణ్‌రెడ్డి, దివ్య, బాలల పరిరక్షణ జిల్లా అధికారి పి.సైదులు, సీడీపీవో ఆర్‌.స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising