ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌కు తగ్గిన వరద

ABN, First Publish Date - 2020-10-04T10:14:22+05:30

నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక శనివా రం మరింత తగ్గింది. దీంతో సాగర్‌ ఆరు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల


నాగార్జునసాగర్‌, చింతలపాలెం, కేతేపల్లి, డిండి, శాలిగౌరారం, అక్టోబరు 3: నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక శనివా రం మరింత తగ్గింది. దీంతో సాగర్‌ ఆరు గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు 1,35506 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0405 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 589.80అడుగులుగా(311.4474 టీఎంసీలుగా) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8642 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5800, ఎస్‌ఎల్‌బీసీకి 1800, వరద కాల్వకు 600, ప్రధాన జలవిద్యు త్‌ కేంద్రం నుంచి 28826, క్రస్ట్‌గేట్ల నుంచి 89,838, మొత్తం 1,35, 506 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి అంతే మొత్తంలో వరద వస్తోంది. పులిచింతల ప్రాజెక్టుకు శనివారం ఎగు వ నుంచి వరద కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు(45.77టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 174.73 అడుగులు(45.35టీఎంసీలు)గా ఉంది.


ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1,09,216 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నాలుగు క్రస్ట్‌గేట్లను మూడు మీటర్లమేర ఎత్తారు. మూసీ ప్రాజెక్టుకు 2075 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా, ప్రస్తుతం 644.20అడుగులు గా ఉంది. మూసీ రెండు క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు 2870క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డిండి రిజర్వాయర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులకు (2.4 టీఎంసీ)చేరగా, 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 21 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ప్రాజెక్టు నుంచి  కుడి, ఎడమ కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు.


సాగర్‌లో పర్యాటకుల సందడి

వరుస సెలవు దినాలు కావడంతో శనివారం సాగర్‌లో పర్యాటకుల సందడి ఏర్పడింది. ఓ వైపు ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడం, మరో వైపు జలాశయంలో లాంచీలను నడుపుతుండటంతో పర్యాటకులు అఽధిక సంఖ్యలో సాగర్‌కు తరలివచ్చారు. ఆరు నెలలుగా ప్రజలు కరోనా నేపఽథ్యంలో ఇళ్లకే పరిమితం కావడంతో, సేద తీరేందుకు పెద్ద సం ఖ్యలో సాగర్‌కు వస్తున్నారు.సాగర్‌ జలాశయంలో లాంచీ ఐదుజాలీ ట్రిప్పులు నడిపినట్టు, దీంతో రూ.50వేల ఆదా యం సమకూరినట్లు లాంచీ స్టేషన్‌ మేనేజర్‌ హరి తెలిపారు.

Updated Date - 2020-10-04T10:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising