రాగ్యానాయక్ సేవలు గొప్పవి : ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2020-12-30T05:13:46+05:30
జిల్లా ప్రజలకు రాగ్యానాయక్ చేసిన సేవలు గొప్పవని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.
మిర్యాలగూడ, డిసెంబరు 29: జిల్లా ప్రజలకు రాగ్యానాయక్ చేసిన సేవలు గొప్పవని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ చీఫ్ విప్ భారతీరాగ్యానాయక్, మునిసిపల్ చైర్మన్ తిరుగనరు భార్గవ్, స్కైలాబ్ నాయక్, రాంచందర్‌నాయక్, మేగ్యా, విష్ణు, నారాయణరెడ్డి, షోయబ్, బాలాజీ, హనుమంతరెడ్డి, అదే విధంగా రాగ్యానాయక్ వర్ధంతి సభను రాజీవ్ భవన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కేతావత్ శంకర్‌నాయక్, బీఎల్‌ఆర్, వేణుగోపాల్‌రెడ్డి, దేవరకొండలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ యూనుస్, కిన్నెర హరికృష్ణ, రమేష్, ఇంతియాజ్, ఉమేర్, హాలియాలో భగవాన్‌నాయక్, శంకర్‌నాయక్, బాబురావునాయక్, తిరుమలగిరిలో ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్, ఎంపీటీసీ పుట్లూరు రాజశేఖర్‌రెడ్డి, భిక్షానాయక్, గుర్రంపోడులో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎల్లేష్, శివాజీ, నాగార్జునసాగర్‌లో భగవాన్‌నాయక్, దినే్‌షనాయక్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:13:46+05:30 IST