ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛమైన కల్లును విక్రయించాలి

ABN, First Publish Date - 2020-12-30T06:23:39+05:30

కల్లుగీత కార్మికులు కూడా కల్తీ చేయకుండా స్వచ్ఛమైన కల్లును విక్రయించాలని, కల్తీ చేసినట్లు నిరూపణ అయితే సొసైటీ కూడా రద్దు అవుతందని ఎక్సైజ్‌శాఖ సీఐ నాగిరెడ్డి అన్నారు.

గుర్తింపుకార్డులు అందజేస్తున్న ఎక్సైజ్‌ సీఐ నాగిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 29 :  కల్లుగీత కార్మికులు కూడా కల్తీ చేయకుండా స్వచ్ఛమైన కల్లును విక్రయించాలని, కల్తీ చేసినట్లు నిరూపణ అయితే సొసైటీ కూడా రద్దు అవుతందని ఎక్సైజ్‌శాఖ సీఐ నాగిరెడ్డి  అన్నారు.  భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం ఆద్వర్యంలో 116 మంది కల్లుగీత కార్మికులకు టీటీసీఎస్‌ తాడితాపి కమ్యూనిటీ సొసైటీ గుర్తింపు కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  సీఐ నాగిరెడ్డి మాట్లాడుతూ కార్మికులు గుర్తింపుకార్డులు కలిగి ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వర్తిస్తుందని అన్నారు.  కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సుర్వి సత్యనారాయణ, సర్పంచు బొడిగె శంకరయ్యగౌడ్‌, మాజీ సర్పంచు సుర్వి రవీందర్‌, ఉపాధ్యక్షులు వీరమల్లు రాములు, బొడిగె మల్లయ్య, సభ్యులు వీరమల్ల యాదగిరి, ఉడుతల నర్సింహ, సుంకరి కిష్టయ్య, బొడిగె మల్లేష్‌, సుర్వి బాలయ్య, సుర్వి అంజయ్య, బొడిగె శ్రీను, జంగయ్య, సుర్వి కుమారస్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T06:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising