ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను సంరక్షించి పచ్చదనం పెంచాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-12-20T05:29:28+05:30

మొక్కలను సంరక్షించి పచ్చదనం పెంచాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు.

మొక్కల పెంపకంపై సూచనలిస్తున్న కలెక్టర్‌ పాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనగల్‌, డిసెంబరు 19 : మొక్కలను సంరక్షించి పచ్చదనం పెంచాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. శనివారం ఆయన మండలంలోని ఇస్లాంనగర్‌, తేలకంటిగూడెం, ఎస్‌లింగోటం, బాబాసాయిగూడెం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, మంకీ ఫుడ్‌ కోర్టులను, సాగర్‌ రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కలు నాటి పెద్దవిగా ఎదిగే వరకు తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలకు సకాలంలో నీరు అందించాలన్నారు. అదేవిధంగా ప ల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సోమసుందర్‌రెడ్డి, డీటీ తబిత, ఆర్‌ఐ అరుణ, కార్యదర్శి యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising