ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతాంగ సంక్షేమానికి ప్రణాళికలు రూపొందిస్తాం

ABN, First Publish Date - 2020-03-13T11:49:55+05:30

ఉమ్మడి జిల్లాలో రైతాంగ సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించి త్వరితగతిన అమలు చేస్తామని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి 


నల్లగొండ, మార్చి12 : ఉమ్మడి జిల్లాలో రైతాంగ సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించి త్వరితగతిన అమలు చేస్తామని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపా రు. గురువారం ఆయన డీసీసీబీ కార్యాలయంలో పాలక వర్గం తొలి సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా పాలకవర్గం లేకున్నా  డీసీసీబీ సీఈఓతో పాటు డీజీఎంలు, ఏజీఎంలు, ఇతర అధికారులు, సిబ్బంది కృషి మూలంగా బ్యాంకు రూ.10కోట్ల లాభాల్లో ఉందని పేర్కొంటూ ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.


రాష్ట్రంలోనే డీసీసీబీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ ఐదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రైతాంగం అభివృద్ధి కోసం తమ పాలకవర్గం పని చేస్తుందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కొన్ని సొసైటీల్లో జరిగిన అక్రమాల అనంతరం ఆ సొమ్ము రికవరీ కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. ఈ రబీ  సీజన్‌లో ఇప్పటి వరకూ స్వల్పకాలిక రుణాల కింది 104 సొసైటీలకు రూ.15కోట్లను మంజూరు చేశామన్నారు.  మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీల సహాకారంతో బ్యాంకును మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. రైతులకు సకాలంలో రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ దయాకర్‌రెడ్డితో పాటు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన ఎంసీ మీటింగ్‌లో సీఈఓ మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-13T11:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising