ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరస్‌ కట్టడికి ప్రజలు సహకరించాలి

ABN, First Publish Date - 2020-03-27T11:25:28+05:30

కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ అర్బన్‌, భూదాన్‌పోచంపల్లి, దామరచర్ల మార్చి 26: కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డితో కలిసి మార్కెట్‌లో కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల విక్రయాలను పరిశీలించి మాట్లాడారు. కరోనాను అంతం చేసేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.


కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, రూ.1500 అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముం దు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై పరిస్థితిని ఆయన సమీక్షించారు. జాతీయరహదారిపై యాదాద్రి జిల్లా సరిహద్దు భూదాన్‌పోచంపల్లి క్రాస్‌రోడ్డు (కొత్తగూడెం) వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా రహదారిపై వెళ్తున్న వాహనాలను గమనించి అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై ఎవరూ సంచరించకుండా కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. రాత్రి 7నుంచి ఉద యం 6 గంటల వరకు ఎవరూ రోడ్డుపైకి రావద్దని ప్ర జలను ఆయన కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ విధిస్తూ ఎప్పటికప్పుడూ వైద్య పరీక్షలు జరిపి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాఽథ ఆశ్రమానికి వెళ్లారు. మిర్యాలగూడలో కూరగాయలు, మాంసం మార్కెట్లను పరిశీలించి మంత్రి మాట్లాడారు. ప్రజలంతా ఒకే చోట గుమికూడకుండా గణేష్‌ మార్కెట్‌ను ఎన్‌ఎ్‌సపీ క్యాంపు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రామచంద్రగూడెం ఆగ్రోపామ్‌ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


మాంసం మార్కెట్‌ను షాబునగర్‌ పాత మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం వాడపల్లి సరిహద్దును పరిశీలించి మాట్లాడారు. ఈప్రాంతం నుంచి వెళ్లే ప్రయాణికులకు ఏపీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, వారికి సహకరించి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఆయనవెంట ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎప్పీ రంగనాథ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-03-27T11:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising