ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతబస్టాండ్‌ ఆక్రమణల తొలగింపు

ABN, First Publish Date - 2020-07-13T15:50:46+05:30

పట్టణనడిబొడ్డున్న మూడున్నర దశాబ్ధాలుగా కొనసాగుతున్న చెరనుంచి పాతబస్టాండ్‌ స్థలానికి ఎట్టకేలకు విముక్తి కలిగింది. కబ్జాకోరలో చిక్కిన లక్షలాది రూపాయల విలువైన ప్రభుత్వభూమిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడ్డుకునేందుకు యత్నించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు 

మహిళ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు


మిర్యాలగూడ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి): పట్టణనడిబొడ్డున్న మూడున్నర దశాబ్ధాలుగా కొనసాగుతున్న చెరనుంచి పాతబస్టాండ్‌ స్థలానికి ఎట్టకేలకు విముక్తి కలిగింది. కబ్జాకోరలో చిక్కిన లక్షలాది రూపాయల విలువైన ప్రభుత్వభూమిని స్వాధీనపర్చుకునేందుకు పోలీస్‌, మునిసిపల్‌ అధికారులు సిద్దపడ్డారు. దీనిలో భాగంగా ఆదివారం డీఎస్పీ వెంకటేశ్వరరావు, కమిషనర్‌ చీమ వెంకన్న పోలీస్‌, మునిసిపల్‌ సిబ్బందితో కలిసి పాతబస్టాండ్‌ ఆక్రమణలు తొలగి ంచారు. పాత బస్టాండ్‌ వీధుల్లో కొందరు వ్యాపారులు రేకుల షెడ్లు నిర్మించి చిరువ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో పాతబస్టాండ్‌ నలుదిక్కులా వీధులు కుచించుకపోయి ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోంది. సంత రోజులైన ప్రతి మంగళ, శనివారాల్లో జనసంచారం ఎక్కువగా కనిపిస్తోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ, మునిసిపల్‌ కమిషనర్‌ సమక్షంలో పోలీసులు పాతబస్టాండ్‌ వీధుల్లో ఆక్రమంగా నిర్మించిన సుమారు 58దుకాణాలను ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేశారు.


విషయం తెలసుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఎల్‌ఆర్‌, కొమ్ము శ్రీను, ముదిరెడ్డి నర్సిరెడ్డి, శేఖర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, వేణుగోపాల్‌రెడ్డిలతో కలిసొచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. తమ నోటీసులు జారీ చేయకుండా దుకాణాలను తొలగించడం అన్యాయమంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఓ మహిళా వ్యాపారి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయానికి ప్ర యత్నించడాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆక్రమణల తొలగింపు చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఆయనవెంట సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, సదానాగరాజు, రమే్‌షబాబు, నలుగురు ఎస్‌ఐలు ఉన్నారు.

Updated Date - 2020-07-13T15:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising