‘విశాఖ’ ఘటనతో అధికారులు అప్రమత్తం
ABN, First Publish Date - 2020-05-09T09:41:55+05:30
విశాఖ ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వఆదేశాల మేరకు కాలుష్యనియంత్రణ మండలి,
చౌటుప్పల్ రూరల్, మే8: విశాఖ ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వఆదేశాల మేరకు కాలుష్యనియంత్రణ మండలి, పరిశ్రమల భద్రత విభాగం అధికారులు శుక్రవారం మండలంలోని పలు పరిశ్రమలను పరిశీలించారు. అక్కడ వాడుతున్న రసాయనాల వివరాలు పరిశీలించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో వాడిన స్టైరిన్ మోనోమార్ రసాయనం ఉమ్మడి జిల్లాలో ఏ పరిశ్రమల్లో వాడటం లేదని గుర్తించారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేసి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కాలుష్య నియంత్రణ మండలి ఈఈఈ రాజేందర్ తెలిపారు.
Updated Date - 2020-05-09T09:41:55+05:30 IST