ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ రైతుకు టోకెన్‌ : నల్లగొండ జిల్లా కలెక్టర్‌ పీజే.పాటిల్‌

ABN, First Publish Date - 2020-11-13T10:53:56+05:30

సన్నరకం వరిధాన్యం విక్రయానికి జారీచేస్తున్న టోకెన్ల కోసం రైతులు తొందరపడవద్దని, ప్రతి ఒక్కరికి వాటిని అందజేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన్‌: సన్నరకం వరిధాన్యం విక్రయానికి జారీచేస్తున్న టోకెన్ల కోసం రైతులు తొందరపడవద్దని, ప్రతి ఒక్కరికి వాటిని అందజేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సన్న ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేస్తామన్నారు. టోకెన్ల జారీకి ఎలాంటి పరిమితిలేదని, రైతులకు వచ్చే రెండు నెలల వరకు వీటిని జారీ చేస్తామన్నారు. మిర్యాలగూడలో మిల్లుల సామర్ధ్యం ప్రకారం ప్రతి రోజు టోకెన్లు ఇస్తున్నామని, ఒకేసారి అందరికీ టోకెన్‌ ఇవ్వడం సాధ్యపడదన్నారు.


టోకెన్‌ తీసుకున్న రైతులు వరికోతకోసి ధాన్యం తీసుకురావాలన్నారు. సన్నరకాల్లో తేమశాతం తక్కువగా ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయరనే అపోహచెందవద్దన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని, 17 శాతానికి తక్కువ తేమ ఉన్నా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. టోకెన్ల జారీతో మిల్లుల వద్ద ట్రాక్టర్ల రద్దీ తగ్గిందని, రైతులందరూ సహకరించాలని కోరారు.

Updated Date - 2020-11-13T10:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising