ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం టోకెన్ల కోసం రోడ్డెక్కిన రైతులు

ABN, First Publish Date - 2020-11-13T10:52:48+05:30

రైతులకు టోకెన్‌ కష్టాలు తప్పడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా టోకెన్ల పంపిణీని గురువారం నిలిపివేయటంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ, వేములపల్లి, నవంబరు 12: రైతులకు టోకెన్‌ కష్టాలు తప్పడం లేదు. ముందస్తు సమాచారం లేకుండా టోకెన్ల పంపిణీని గురువారం నిలిపివేయటంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ నెల 13వ తేదీకి సంబంధించిన టోకెన్లను 10వ తేదీనే అధికారులు జారీ చేశారు. 18వ తేదీ వరకు సంబంధించిన టోకెన్ల కోసం 11వ తేదీన 1350 మంది రైతులకు సీరియల్‌ నంబర్లు ఇచ్చి పంపారు.


ఇందులో గురువారం విషయాన్ని పేర్కొనలేదు. కాగా, దీనిపై ముందస్తు సమాచారం లేకపోవటంతో రైతులు గురువారం పలు గ్రామాల నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. తీరా టోకెన్లు ఇవ్వడం లేదని తెలిసి కార్యాలయం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ వన్‌టౌన్‌ సీఐ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి పంపించారు. ఇదిలా ఉండగా, టోకెన్ల కోసం రైతులు వేములపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. గురువారం ఉదయం టోకెన్ల కోసం రైతులు ఎంపీడీవో కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. అయితే ఈ 13వ తేదీ వరకు టోకెన్లు జారీచేసేది లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోగా, విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ అక్కడికి చేరుకొని అవసరమైన టోకెన్లు రైతులకు అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

Updated Date - 2020-11-13T10:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising