ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమంలో

ABN, First Publish Date - 2020-11-13T10:50:19+05:30

రైతులకు సంక్షేమ పథకాలు అమలుచేయడంలో రాష్ట్రానిది అగ్రస్థానమని శాసనమండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రం అగ్రస్థానంలో

 శాసనమండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి


నల్లగొండ, నవంబరు 12: రైతులకు సంక్షేమ పథకాలు అమలుచేయడంలో రాష్ట్రానిది అగ్రస్థానమని శాసనమండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌, రైతుబీమా, రైతుబంధు పథకాలు అమలవుతున్నాయన్నారు. పంట దిగుబడి సమయంలో అకాలవర్షాల కారణంగా పత్తి, వరి దెబ్బతిన్నాయన్నారు. ధాన్యం, సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, .రైతులు ఓపికపట్టి మద్దతు ధరకు విక్రయించాలన్నారు. మిర్యాలగూడలోని 66 మిల్లులలో సన్నరకం ధాన్యం కొనుగోలు జరుగుతోందన్నారు. రైతులంతా ఒకేసారి వస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడటంతో రోజుకు 1500 ట్రాక్టర్లను అనుమతించేలా టోకెన్లు ఇస్తున్నారన్నారు.


క్వింటాకు రూ.1800 ధర రైతులకు దక్కుతోందన్నారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలన్నారు. నకిరేకల్‌-నాగార్జునసాగర్‌ వరకు 565 జాతీయరహదారి నిర్మాణం కోసం రూ.421కోట్లతో త్వరలో టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. 85కి.మీ మేరకు రహదారి నిర్మాణం ఉంటుందని, నల్లగొండలోని పానగల్లు వద్ద వెహికిల్‌ అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అంతా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ దీపావళి వేడుకలు చేసుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-11-13T10:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising