ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియంత పాలనకు చరమగీతం పాడడం ఖాయం

ABN, First Publish Date - 2020-12-14T05:28:19+05:30

సీఎం కేసీఆర్‌ నియంత పాలనకు ప్రజలు త్వరలో చరమగీతం పాడడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు.

శ్రీధర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి 

చింతపల్లి, డిసెంబరు 13 : సీఎం కేసీఆర్‌ నియంత పాలనకు ప్రజలు త్వరలో చరమగీతం పాడడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని ప్రశాంతపు రితండాలో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ అనంతరం వారి సమస్యలు విస్మరించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. నాగార్జునసాగర్‌లో సైతం బీజేపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో ప్రశాంతపురి తండాకు చెందిన సు మారు 60మంది బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శివర్ల రమే్‌షయాదవ్‌, జిల్లా ప్ర ధాన కార్యదర్శి చనమోని రాములు, దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి జర్పుల కళ్యాణ్‌నాయక్‌, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలూనాయక్‌, జిల్లా నేతలు దావ శ్రీనివాసులు, బాల్‌జంగయ్యగౌడ్‌, బొడ్డు మహే్‌షగౌడ్‌, సైదులు, వెంకటరమణ, వెంకటేష్‌, శ్రీనివా్‌సయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T05:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising