ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్వ వెంట ఇళ్లకు మార్కింగ్‌ గుబులు

ABN, First Publish Date - 2020-06-04T10:16:35+05:30

వంద అడుగుల రహదారి కోసం నేరేడుచర్లలో ఎన్‌హెచ్‌ అధికారులు గతంలో మార్కింగ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటు ఎన్‌హెచ్‌, ఇటు ఎన్నెస్పీ అధికారుల హుకుంతో సంకటం


నేరేడుచర్ల, జూన్‌ 3: వంద అడుగుల రహదారి కోసం నేరేడుచర్లలో ఎన్‌హెచ్‌ అధికారులు గతంలో మార్కింగ్‌ చేశారు. వేరే ప్రాంతాల్లో ఇప్పటికే రహదారి పనులు మొద లయ్యాయి. నేరేడుచర్లలో ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో ఎన్నెస్పీ అధికారులు సైతం కాల్వ వెంట ఉన్న ఇళ్లకు మార్కింగ్‌ చేస్తున్నారు. పట్టణ మధ్యలో ఆర్‌-3 కాల్వ ఉంది. దీని వెంటే 40 ఏళ్లుగా 110 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన కూడలిలో దుకాణాల సముదాయాలు కూడా ఉన్నాయి. కాల్వ మధ్య నుంచి 44 అడుగుల మేర ఎన్నెస్పీ అధికారులు మార్కింగ్‌ చేస్తుండడంతో కాల్వ వెంట ఉన్న కుటుంబాల్లో గుబులు మొదలైంది. రహదారి వెంట ఆక్రమణలు తొలగించాలని ఇప్పటికే ఎన్‌హెచ్‌ అధికారులు ఇప్పటికే ఆదేశించగా, ప్రస్తుతం ఎన్నెస్పీ అధికారులు కాల్వ వెంట ఉన్న ఇళ్లకు మార్కింగ్‌ వేస్తుండడంతో బాధితుల్లో గుబులు మొదలైంది.


మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేస్తున్నందున రహదారి వెంట ఆక్రమణలు తొలగించాలని గతంలో ఆదేశాలు రావడంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు లైనింగ్‌ మార్చి నర్సయ్యగూడెం మీదుగా మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ మళ్లించారు. ప్రస్తుతం రహదారి పనులు వేగంగా జరగడంతో ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. బైపాస్‌ రోడ్డు వేయాలని నాయకులు ఆందోళన చేసినా ఫలితం లేకుండాపోయింది. వంద అడుగుల దహదారి ఆర్‌అండ్‌బీ తమకు అప్పగించిందని తాము మార్కింగ్‌ చేయలేదని ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొలతలు వేస్తున్నామని ఎన్నెస్పీ ఏఈ భిక్షం తెలిపారు. కాల్వ మధ్య నుంచి 44 అడుగులు తీస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2020-06-04T10:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising