ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేటలో యువతి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2020-11-03T15:42:26+05:30

జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లా నాయక్ తండాకు చెందిన అజ్మీరా కొటేశ్వరి(20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లా నాయక్ తండాకు చెందిన అజ్మీరా కొటేశ్వరి(20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నల్గొండ గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కోటేశ్వరి... ఇంటర్, డిగ్రీలలో కళాశాలలో టాపర్‌గా నిలిచారు. పీజీ కోచింగ్ కోసం గురువారం 29న నల్గొండ నుంచి ఘట్‌కేసర్ వెళ్లిన కోటేశ్వరి అపస్మారక స్థితిలోకి చేరింది. వెంటనే యువతిని ఖమ్మం మమత ఆస్పత్రికి తరలించారు. కాగా యువతిపై అత్యాచారం జరిగిందని, పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు వెల్లడించారు. వెంటనే యువతిని హైదరాబాద్ తరలిస్తుండగా ఆదివారం మృతి చెందింది. 


పోలీసుల జోక్యంతో నిన్న కోదాడలో మృతదేహానికి పోస్తుమార్టం పూర్తి అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కోటేశ్వరిని  బైక్‌పై స్నేహితురాలి బంధువు తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని బంధువులు స్పష్టం చేశారు. ఈ విషయంపై మానవహక్కుల సంఘాన్ని బాధితులు ఆశ్రయించారు. దీంతో ఈ ఘటనపై కోదాడలో ఆందోళనలు చేసేందుకు ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి. 

Updated Date - 2020-11-03T15:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising