మిర్యాలగూడలో నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
ABN, First Publish Date - 2020-11-03T13:53:01+05:30
జిల్లాలోని మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లు నిలిపివేశారు.
నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లు నిలిపివేశారు. సన్న రకం ధాన్యానికి ధర తక్కువగా వేశారని నిన్న బాలాజీ రైస్ మిల్లును టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. మిల్లు సీజ్, మిల్లర్లపై అధికారుల ఒత్తిడిని నిరసిస్తూ నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు మిల్లర్లు సిద్ధమయ్యారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ధాన్యం నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తున్నామని మిల్లర్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరాయి. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Updated Date - 2020-11-03T13:53:01+05:30 IST