ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డయాలసిస్‌ దయనీయం... ఈపీఓ, ఐరన్‌ ఇంజక్షన్ల కొరత

ABN, First Publish Date - 2020-12-11T06:04:37+05:30

డయాలసిస్‌ రోగులపట్ల ఎవరికీ దయలేకుండా పోయింది. ఇటు అనారోగ్యంతో బాధపడుతూ, అటు ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయించుకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

డయాలసిస్‌ వైద్యం చేయించుకుంటున్న రోగి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు నెలలుగా ఆగిన సరఫరా



మిర్యాలగూడ అర్బన్‌, డిసెంబరు 10: డయాలసిస్‌ రోగులపట్ల ఎవరికీ దయలేకుండా పోయింది. ఇటు అనారోగ్యంతో బాధపడుతూ, అటు ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయించుకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మూడు నెలలుగా ఈపీవో, ఐరన్‌ ఇంజక్షన్ల కొరత ఏర్పడడంతో అప్పులు చేసి ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. లేదంటే ప్రాణం మీదికొచ్చి పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉండటంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజక్షన్లు ఆరోగ్యశ్రీ నుంచి రావాలని కాంట్రాక్టు సంస్థ చెబుతుండగా, లేదు కాంట్రాక్టు సంస్థే సమకూర్చాలని ఆరోగ్యశ్రీ అధికారులు ఒకరి మీద మరొకరు చెప్పుకుంటూ రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిడ్నీవ్యాధితో బాధపడుతున్న రోగులకు వారం వారం రక్తం శుద్ధి చేయాల్సి ఉంటుంది. మూత్ర పిండాల పనితీరు తగ్గి, పనిచేయడం మానేసినప్పుడు డయాలసిస్‌ అవసరమవుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్న అంశం. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 260మందికిపైగా రోగులు డయాలసిస్‌ సేవలు పొందుతున్నారు. వీరిలో వారంలో రెండుసార్లు రక్తం శుద్ధిచేయించుకునే రోగులు అధికంగా ఉన్నారు. వీరంతా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారే. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ కేంద్రాల్లో ఉచితంగా డయాలసిస్‌ వైద్య సేవలందిస్తున్నారు. 


డయాలసి్‌సకు రూ. 2వేల ఖర్చు

డయాలసిస్‌ రోగులకు అవసరమైన ఇంజక్షన్లను ఆరోగ్యశ్రీ నుంచి సరఫరా చేయాలని కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కాంట్రాక్టు పొందిన సంస్థే ఉచితంగా ఇచ్చే మందులను సరఫరా చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వీరిద్దరి మధ్య రోగులు నలిగిపోతున్నారు. రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అప్పుచేసి మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఈపీఓ ఇంజక్షన్‌ ధర రూ.1700 వరకు ఉండగా, మికోసన్‌ ఫార్మకంపెనీ ఐరన్‌ ఇంజక్షన్‌ రూ.300కు లభిస్తుంది. దీంతో డయాలసిస్‌ సమయంలో ఒక్కో రోగికి సుమారు రూ.2వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఆర్థిక పరమైన ఇక్కట్లు తప్పడం లేదు. 


కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యమే కారణమా?

డయాలసిస్‌ కేంద్రాల్లో రోగులకు అవసరమైన ఇంజక్షన్లు సమకూర్చడంలో కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. రక్తశుద్ధి సమయంలో విధిగా ఇరిథ్రోపొయిన్‌(ఈపీఓ), ఐరన్‌ ఇంజక్షన్లు ఇస్తే రోగి శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. మూడునెలలుగా ఇంజక్షన్ల సరఫరా నిలిచిపోయింది. విలువైన ఇంజక్షన్లు కొనుగోలు చేయలేని రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. దీంతో వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రైవేట్‌ ఫార్మసీల నుంచి ఇంజక్షన్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి డయాలసి్‌సకు ఈపీఓ, ఐరన్‌ ఇంజక్షన్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో రోగికి ప్రతినెలా 10 ఈపీవో, మూడు ఐరన్‌ ఇంజక్షన్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రభుత్వం ప్రతినెలా నాలుగు ఈపీఓ, రెండు ఐరన్‌ ఇంజక్షన్లను సరఫరా చేస్తుంది. మిగతా ఇంజక్షన్లకు రోగులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. 



సకాలంలో ఇంజక్షన్లు అందించాలి : జె.నాగేందర్‌, వేములపల్లి 

ప్రతినెలా 10 ఈపీఓ ఇంజక్షన్లు అవసరం కాగా నాలుగు మాత్రమే ఉచితంగా అందిస్తుంటే, మరో ఆరు బయటకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలాగే మూడు ఐరన్‌ ఇంజక్షన్లలో రెండింటినే ప్రభుత్వం అందిస్తే మరొకటి కొనుక్కోవాల్సి ఉంటుంది. మూడు నెలలుగా మందులు అందక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాం. 


యాదాద్రి జిల్లాపై కనికరం ఏదీ

యాదాద్రి, డిసెంబరు 10 (అంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో కిడ్నీ రోగులకు ప్రభుత్వం డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయలేదు. జిల్లాలో సుమారు మూడు వేల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స అందక హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. జిల్లాకేంద్రంలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. రూ.2కోట్ల అవసరమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు నివేదించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మూడువేల చదరపు అడుగుల భవనం అందుబాటులో లేకపోవడంతో ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయలేదు. ఇతర జిల్లాల్లో కేంద్రాలు మంజూరు చేస్తున్నా యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో ఏర్పాటు కు ప్రభుత్వం కనికరం చూపడంలేదు. ఆలేరు ఎ మ్మెల్యే గొంగిడి సునీత మహేందరెడ్డి తన నియోజకవర్గ రోగుల అవసరాలకోసం కొలనుపాక జైన ఆలయ ట్రస్ట్‌ వారితో ఆలేరులో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేఆయించారు. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటు కానుండడంతో భువనగిరిలో డయాలసిస్‌ సెంటర్‌ ప్రతిపాదన పూర్తిగా మూలకు పడినట్టుగా తెలుస్తోంది. 

Updated Date - 2020-12-11T06:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising