నల్లగొండకు తిరిగొస్తా
ABN, First Publish Date - 2020-12-05T05:57:41+05:30
భూమి గుండ్రంగా తిరుగుతూ ప్రతిరోజు యథాస్థితికి వచ్చినట్లు, తాను ఎటు వెళ్లినా తిరిగి నల్లగొండకే వస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
వారంలో రెండు రోజులు కార్యకర్తలతో ఉంటా
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భూమి గుండ్రంగా తిరుగుతూ ప్రతిరోజు యథాస్థితికి వచ్చినట్లు, తాను ఎటు వెళ్లినా తిరిగి నల్లగొండకే వస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ, నార్కట్‌పల్లి, కనగల్ లో జరిగిన ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోనూ ఢిల్లీ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, రైతుల పోరాటానికి తన మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అన్నదాతల కోసం లాఠీ దెబ్బలకైనా, జైలు కెళ్లడానికై నా తాను సిద్ధమేనని పునరుద్ఘాటించారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా పెద్దఎత్తున రైతులు చేస్తున్న ఆందోళనలు స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుల పూర్తికి త్వరలో లక్ష మంది రైతులతో ఉద్యమం చేపడతాననన్నారు. నల్లగొండ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, తన కుమార్తె వివాహం మూలంగా నల్లగొండ ప్రజలకు కొంత దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ఇక నుంచి వారంలో రెండు రోజులు నల్లగొండ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ఈనెల 9న ఆందోళన చేపడతామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-05T05:57:41+05:30 IST