ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూసీ ఆయకట్టులో సాగు సందడి

ABN, First Publish Date - 2020-12-17T05:59:00+05:30

కేతేపల్లి, డిసెంబరు 16: కేతేపల్లి, డిసెంబరు 16: కాల్వల ఆయకట్టులో యాసంగి పంటల సాగుకు రైతాంగం సమాయత్తమయ్యింది.

మూసీ కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూసీకి నీటి విడుదల

  కేతేపల్లి, డిసెంబరు 16:  కాల్వల ఆయకట్టులో యాసంగి పంటల సాగుకు రైతాంగం సమాయత్తమయ్యింది. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సాగునీటి విడుదలతో ఆయకట్టులో పంటల సాగు సందడి నెలకొంది. ఈ ఏడాది మూసీ ఆయకట్టులో యాసంగి పంటల సాగుకోసం నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఏటా డిసెంబర్‌ 18నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేవారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభం నుంచి కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టు నీటితో నిండుకుండలా ఉంటూవస్తోంది. దీంతో ఈ ఏడాది ముందస్తుగా ఆయకట్టులోని దాదాపు 35వేల పైచిలుకు ఎకరాలకు సాగునీటిని అందించాలన్న జిల్లా మంత్రి జగదీ్‌షరెడ్డి సూచనతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ఈ నెల15న సాగునీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఇటీవలి వరకూ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు విడుదలైన నీటితో రైతులు వరి నార్ల పెంపకం చేపట్టారు. షెడ్యూలు ప్రకారం కాల్వలకు అధికారికంగా నీటిని వదలడంతో   రైతులు సాగులో బిజీ అయ్యారు.

Updated Date - 2020-12-17T05:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising