ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపక్షాల గందరగోళం నడుమ మునిసిపల్‌ సమావేశం

ABN, First Publish Date - 2020-12-30T06:20:56+05:30

నిఽధుల సద్వినియోగం, మునిసిపల్‌ మడిగెల అద్దెకు బహిరంగ వేలం, చెత్తసేకరణ ప్రైవేటీకరణ, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం తదితర అంశాలపై విపక్ష సభ్యుల గందరగోళం నడుమ భువనగిరి మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం మంగళవారం కొనసాగింది.

సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చెత్త సేకరణ ప్రైవేటీకరణ మినహా ఎజెండా అంశాల ఆమోదం 

భువనగిరి టౌన్‌, డిసెంబరు 29: నిఽధుల సద్వినియోగం, మునిసిపల్‌ మడిగెల అద్దెకు బహిరంగ వేలం, చెత్తసేకరణ ప్రైవేటీకరణ, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం తదితర అంశాలపై విపక్ష  సభ్యుల గందరగోళం నడుమ భువనగిరి మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం మంగళవారం కొనసాగింది. చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చెత్త సేకరణకు యూజర్‌ చార్జీల వసూళు అంశం వాయిదా పడగా మిగతా 12 అంశాలను కౌన్సిల్‌ సమావేశం ఆమోదించింది. చెత్త సేకరణను ప్రైవేటీకరణ చేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు వ్యతిరేకించగా 29వ వార్డు సభ్యుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు కౌన్సిల్‌ సమావేశం నుంచి వాకౌట్‌ చేశాడు. అలాగే నిధుల మళ్లింపు, సద్వినియోగంపై కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ పాలక పక్షాన్ని తప్పుపట్టగా బీజేపీ సభ్యులు రత్నపురం బలరాం, ఉదయగిరి విజయ్‌కుమార్‌లు నిరసించారు.  చైర్మన్‌ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని, పట్టణ ప్రధాన రహదారి విస్తరణకు త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T06:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising