ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి : రవీంద్రనాయక్‌

ABN, First Publish Date - 2020-12-05T06:10:58+05:30

నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు 4 : నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం మండలంలోని 70మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణల క్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ పథకంతో పేదింటి ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతా్‌పరెడ్డి, మాజీ జడ్పీటీసీ తేరా గోవర్దన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ వల్లపురెడ్డి, శిరసువాడ శ్రీనయ్య, సర్పంచ్‌ గోర్ల సైదమ్మ, ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు. మండలంలోని దుగ్యాల గ్రామంలో రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠదామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Updated Date - 2020-12-05T06:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising