ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దతు ధరపై అవగాహన కల్పించాలి : రవీంద్రకుమార్‌

ABN, First Publish Date - 2020-12-03T06:04:45+05:30

రైతులు మద్దతు ధర పొందేలా ప్రజాప్రతినిధులు, అధికారు లు వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిండి, డిసెంబరు 2 : రైతులు మద్దతు ధర పొందేలా ప్రజాప్రతినిధులు, అధికారు లు వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. డిండి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చొరవ చూపాలన్నారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్‌ భగీరథ పనులు వేగవంతం అయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు నిర్మాణాలకు కావాల్సిన ఇసుక గురించి సభ దృష్టికి తేగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మీసేవలో దరఖాస్తులు చేసుకుంటే ఇసుక రీచ్‌ల నుంచి రవాణా అవుతుందని, వివరాలకు అధికారులను సంప్రదించాలని కోరారు. మండల సర్వసభ్య సమావేశానికి అధికారులందరూ విధిగా హాజరుకావాలన్నారు. ఎంపీపీ సునీత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 ఫ కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. బుధవారం ఆయన మండలంలో 30మంది లబ్ధిదారులకు క ల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ  చేసి మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, ఎంపీడీవో గిరిబాబు, డీటీ ప్రశాంత్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T06:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising