‘మిర్యాల’ మీదుగా ప్రత్యేక రైళ్లు.. లాక్‌డౌన్ అనంతరం తిరిగి ప్రారంభం
ABN, First Publish Date - 2020-12-11T06:07:20+05:30
కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో నిలిచిన రైల్వే సేవలు పునః ప్రారంభం అవుతున్నాయి. స్పెషల్ ట్రైన్లతో ప్ర యాణికులను దూర ప్రాంతాలకు చేరవేస్తున్న రైల్వే శాఖ సర్వీసులను క్రమంగా పెంచుకుంటూ పోతోంది.
కొన్ని రైళ్లకు ఇవ్వని స్టాపింగ్ పాయింట్
అన్నింటికి ఇవ్వాలని కోరుతున్న ప్రయాణికులు
మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 10 : కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో నిలిచిన రైల్వే సేవలు పునః ప్రారంభం అవుతున్నాయి. స్పెషల్ ట్రైన్లతో ప్ర యాణికులను దూర ప్రాంతాలకు చేరవేస్తున్న రైల్వే శాఖ సర్వీసులను క్రమంగా పెంచుకుంటూ పోతోంది. అందులో భాగంగా మిర్యాలగూడ పట్ట ణం మీదుగా ప్రత్యేక రైళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లాక్‌డౌన్‌తో నిలిచిన రైల్వే సేవలు నెలన్నర క్రితమే ఆరంభమైనా ప్రయాణికులు గమ్య స్థానాన్ని చేరుకోవాలంటే స్టార్టింగ్ పాయింట్‌కు వెళ్లాల్సి వచ్చేది. అయితే ప్రయాణికుల ఇక్కట్లను గుర్తించిన రైల్వే అధికారులు పట్టణంలోనే రైలు ఎక్కేలా ప్రత్యేక ట్రైన్ల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే కొన్ని ట్రైన్లు ఇక్కడ స్టాపింగ్ లేకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. అన్ని ట్రైన్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పట్టణం మీదుగా వెళ్లే రైళ్లు
మిర్యాలగూడ పట్టణం మీదుగా వెళ్లే రైళ్ల షెడ్యూల్‌ను రైల్వే అధికారులు విడుదల చేశారు. శబరి, ఫలక్‌నామా, విశాఖ, మద్రా్‌స(చెన్నై), నారాయణాద్రి, లోక్‌మాణ్యా తిలక్, భావానగర్ కాకినాడ, నర్సాపూర్, నాగర్‌సోల్ (షిర్డీ) ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక రైళ్లకు మిర్యాలగూడలో స్టాప్ ఇ చ్చినట్లు అధికారులు తెలిపారు. రైళ్లన్నీ పాత రూట్లవే అయినా ట్రైన్ నెంబర్లలో మార్పు ఉంటుందని, ప్రయాణికులు గమనించాలని కోరారు. ఉదాహరణకు గతంలో నారాయణాద్రి ట్రైన్ నెంబర్ 12733-12734 ఉండగా ప్రత్యేక ట్రైన్ నారాయణాద్రి నెంబర్ 02733-02734గా ఉంటుంది.
ఎక్కేందుకు ఓకే.. మరి దిగేందుకు
రైల్వే సేవలు పునః ప్రారంభం అవుతుండడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పట్టణం మీదుగా ఇరువైపులకు వెళ్లే పలు ట్రైన్లలో కొన్నింటికి రైల్వేశాఖ మిర్యాలగూడలో స్టాప్ ఇవ్వలేదు. నర్సాపూర్, చెన్నై, నారాయణాద్రి, విశాఖ ట్రైన్లలో రిటర్న్ జర్నీ చేసే ప్రయాణికులకు మిర్యాలగూడలో స్టాప్ లేకపోవడంతో నల్లగొండలో దిగాల్సి ఉంటుంది. ఇక గుంటూరు వైపునకు ప్రతి రోజు వెళ్లే నాగర్‌సోల్, మంగళ, ఆదివారాల్లో వెళ్లే రైళ్లకు పట్టణంలో స్టాప్ ఇవ్వలేదు.
వెల్లువెత్తుతున్న వినతులు
పట్టణం మీదుగా రైల్వేశాఖ నడిపిస్తున్న ప్రత్యేక ట్రైన్లు అన్నింటికీమిర్యాలగూడలో స్టాప్ ఇవ్వాలని ప్రయాణికుల వినతులు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి, షిరిడీ పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారు కుటుంబసభ్యులందరిని తీసుకెళ్తారని, తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడ గాక నల్లగొండలో దిగి ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో మాదిరిగానే అన్ని ట్రైన్లను మిర్యాలగూడలో నిలపాలని కోరుతున్నారు.
మిర్యాలగూడలో స్టాప్ ఇవ్వాలి
రైల్వే సేవలు పునరుద్ధరించడం హర్షణీయం. అయితే మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ వైపునకు వెళ్లే నారాయణాద్రి, విశాఖ, నర్సాపూర్, చెన్నై ట్రైన్లు, షిరిడీ నుంచి గుంటూరు వైపునకు వెళ్లే నర్సాపూర్ ఎక్స్‌ప్రె్‌సలకు మిర్యాలగూడలో స్టాప్ ఇవ్వకపోవడం సరికాదు. జిల్లావ్యాప్తంగా అత్యధిక మంది ప్రయాణికులు ఎక్కేది, దిగేది మిర్యాలగూడ నుంచే. ఇదే విషయమై రైల్వే అధికారులకు మెయిల్ చేయగా పరిశీలిస్తామన్నారు.
- చిల్లంచర్ల గోపీకృష్ణ, రైల్వే ప్రయాణికుడు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మిర్యాలగూడలో స్టాప్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం మిర్యాలగూడ మీదుగా తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. స్పెషల్ ట్రైన్లలో జనరల్ కం పార్ట్‌మెంట్లు ఉండవు. ఈ విషయాన్ని ప్ర యాణికులు గమనించాలి. కోవిడ్ నిబంధనల మేరకు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులనే అనుమతిస్తు న్నాం. దగ్గు, జ్వరం, జలుబుతో ఉన్నవారు, మాస్కులు ధరించని వారిని రైలు ప్రయాణానికి అనుమతించం.
- జానిబాబా, స్టేషన్ సూపరింటెండెంట్, మిర్యాలగూడ
Updated Date - 2020-12-11T06:07:20+05:30 IST