ఆపదకాలంలో సేవాతత్పరులు
ABN, First Publish Date - 2020-03-27T11:24:18+05:30
ఆపద్ఖాలంలో మేమున్నామంటూ పలువురు ముందుకొచ్చి సాయమందించి ఉదారతను చాటుకుంటున్నారు.
పలువురు సీఎం రిలీఫ్ ఫండ్‌కు సాయం
మరికొందరు ప్రజలకు సాయం
అమ్మానాన్న అనాథాశ్రమానికి 60క్వింటాళ్ల బియ్యం
కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి జగదీ్‌షరెడ్డి
చౌటుప్పల్ టౌన్, మార్చి26: ఆపద్ఖాలంలో మేమున్నామంటూ పలువురు ముందుకొచ్చి సాయమందించి ఉదారతను చాటుకుంటున్నారు. కొందరు సీఎం రిలీఫ్ ఫండ్‌కు సాయమందించగా మరికొందరు ప్రజలకు సాయమందిస్తూ ఉదారత చాటుకున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని అమ్మానాన్న అనాథాశ్రమానికి 60 క్వింటాళ్ల బియ్యాన్ని సరఫరా చేయాలని కలెక్టర్‌ను విద్యుత్ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఆకస్మికంగా ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమాన్ని నిర్వహించడం కష్టంగా ఉన్నందున ప్రభుత్వ సదుపాయాలను పెంచాలని నిర్వాహకుడు గట్టు శంకర్ కోరాడు. కరోనా సమస్యతో దాతలు సైతం ముందుకు రావడానికి భయపడుతున్నారని పేర్కొన్నాడు. దివ్యాంగుల పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే కలెక్టర్ అనితారామచంద్రన్‌కు ఫోన్‌చేసి ఆశ్రమానికి 60క్వింటాళ్ల బియ్యాన్ని పంపించాలని ఆదేశించారు. ఇబ్బ ందులు ఉంటే తన దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయ న వెంట ఆర్డీవో ఎస్.సూరజ్‌కుమార్, మునిసిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, తహసీల్ద్దార్ గిరిధర్‌రావు, కమిషనర్ రామదుర్గారెడ్డి, ఆర్‌ఐ రాజేష్ పాల్గొన్నారు. ాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2020-03-27T11:24:18+05:30 IST