ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంటాల్లో మోసం

ABN, First Publish Date - 2020-04-25T09:47:01+05:30

సూర్యాపేట మునిసిపాలిటి పరిధిలోని కుపిరెడ్డిగూడెంలోని ఐకేపీ కేంద్రంలో కాంటాల్లో మోసంపై రైతులు శుక్రవారం ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బస్తాకు రెండు కేజీల మోసంపై రైతుల నిలదీత

హెచ్చుతగ్గులు భర్తీ చేస్తామని నిర్వాహకుల హామీ 


సూర్యాపేట రూరల్‌ , ఏప్రిల్‌ 24: సూర్యాపేట మునిసిపాలిటి పరిధిలోని కుపిరెడ్డిగూడెంలోని ఐకేపీ కేంద్రంలో కాంటాల్లో మోసంపై  రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. రైతులు శుక్రవారం వేరే కాంటాతో తూకం వేయగా 40 కేజీల బస్తా 42 కేజీలు చూపడంపై నిలదీశారు. ఇప్పటివరకు కాంటా వేసిన ధాన్యంలో హెచ్చుతగ్గులను భరిస్తామని నిర్వాహకులు తెలపడంతో గొడవ సద్దుమనిగింది. ఆలేరు: ఆలేరు మునిసిపాలిటీ పరిధిలోని సాయిగూడెం  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల మానిటరింగ్‌ అధికారి జ్యోతిర్మయి పరిశీలించారు. సంస్థాన్‌నారాయణపురం: మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్‌ చైర్మన్‌ జక్కిడి జంగారెడ్డి, సర్పంచ్‌ శికిలమెట్ల శ్రీహరి, ఎంపీడీవో జలేందర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. 


మాడ్గులపల్లి: మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. భువనగిరి రూరల్‌: అనాజిపురం ఐకేపీ కేంద్రాన్ని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పరిశీలించారు. వలిగొండ:  సుంకిశాల గ్రామంలో పైళ్ల మల్లారెడ్డి 14వ వర్ధంతిలో పాల్గొని ఆయన స్మారక స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 300కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. పెన్‌పహాడ్‌: మండలంలో పీఏసీఎస్‌, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  12 కొనుగోలు కేంద్రాల్లో  ధాన్యం కాంటాలను సకాలంలో వేయనందున రైతులు ఇబ్బంది పడుతున్నారు. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తమ ధాన్యం రాశులు తడుస్తాయని భయపడుతున్నారు. లారీలు లేనందున  ధాన్యం మిల్లులకు ఎగుమతి కావట్లేదు. గన్నీబస్తాలు కొరత సైతం ఉందని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-04-25T09:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising