ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-13T05:46:34+05:30

కుటుంబ కలహాలతో ఓ వివాహిత శనివారం ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోటకొండూరు, డిసెంబరు 12: కుటుంబ కలహాలతో ఓ వివాహిత శనివారం ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కొప్పుల పద్మ(32)కు 15ఏళ్ల క్రితం ఆత్మకూరు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పద్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎవరూ లేని సమయంలో తల్లిగారి నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వెంకన్న తెలిపారు. 


ఫోర్జరీ కేసు నమోదు  

చింతపల్లి, డిసెంబరు 12:  నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని కుర్మేడు గ్రామానికి చెందిన వ్యాపా రిపై  శనివారం ఫోర్జరీ కేసు నమోదైంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... కుర్మేడు గ్రామానికి చెందిన జడ మంగయ్యకు గ్రామంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆయన ఖాతా నుంచి అదే గ్రామానికి చెందిన తిరుమల ఎరువులు, విత్తనాల దుకాణం యజమాని రాటకొండ ప్రసాద్‌ మంగ య్య సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ. 60వేలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు మంగయ్య చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


 ట్రక్కు, ఆటో ఢీకొని ఆరుగురికి గాయాలు

 ట్రక్కు, ఆటో ఢీకొని ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూరు నుంచి తిరుమలగిరికి వస్తున్న ఆటోను పట్టణంలోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో, ఎదురుగా వస్తున్న ఏపీ24టీసీ 2179 నెంబరు గల ట్రక్కు ఢీకొట్టింది.ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరికి కాలు విరిగినట్లు తెలిపారు.  పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

షార్ట్‌సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం

ఆత్మకూర్‌(ఎస్‌), డిసెంబరు 12 : షార్ట్‌సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధమైంది. స్థానికులు  తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం  తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి పొట్టపెంజర సోమయ్య పూరింట్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపి ంచి పూరిల్లు దగ్ధమైంది. సోమయ్య ప్రస్తుతం హైదరాబాద్‌లో జీవనోపాధి కోసం ఉంటున్నాడు. ప్రస్తుతం సోమయ్య బావమరిది బత్తుల గురువయ్య అందులో నివాసముంటున్నాడు. ఇంట్లో చిక్కుకున్న గురువయ్య స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రూ.50 వేలు, బియ్యం, పలు సామాగ్రి బూడిదైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.


Updated Date - 2020-12-13T05:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising