ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొండచిలువ
ABN, First Publish Date - 2020-11-18T06:43:31+05:30
యాదాద్రి భువనగిరి భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొండచిలువను రైతులు కొట్టి చంపారు.
భూదాన్‌పోచంపల్లి, నవంబరు 17: యాదాద్రి భువనగిరి భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొండచిలువను రైతులు కొట్టి చంపారు. మంగళవారం ధాన్యం తీసుకువచ్చిన రైతులకు సుమారు 18 అడుగుల కొండచిలువ కనిపించడంతో ఆందోళనతో రాళ్లతో కొట్టారు. గతంలోనూ అనేకమార్లు పాములు వచ్చాయని, ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి వెళ్లాలంటే భయం వేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Updated Date - 2020-11-18T06:43:31+05:30 IST