ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైలం సంతోష్‌ మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు

ABN, First Publish Date - 2020-12-04T05:08:44+05:30

ప్రజా ఉద్యమాలకు కళాకారుడు పైలం సంతోష్‌ మరణం తీరని లోటని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు కోదండరాం అన్నారు.

పైలం సంతోష్‌ చిత్రపటం వద్ద నినాదాలు చేస్తున్న కోదండరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరిడేపల్లి రూరల్‌, డిసెంబరు 3 : ప్రజా ఉద్యమాలకు కళాకారుడు పైలం సంతోష్‌ మరణం తీరని లోటని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు కోదండరాం అన్నారు. మండలంలోని వెలిదండ గ్రామంలో సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పయిలం సంతోష్‌ సంతాపసభలో ఆయన మాట్లాడారు. సంతోష్‌ మరణించినా ఆయన పాట ప్రజల్లో నిత్యం బతికే ఉంటుందని ఆయన అన్నారు. సారా నిషేధ ఉద్యమంతో పాటు తెలంగాణ మలిదశ ఉద్యమంలో సంతోష్‌ చురగ్గా రాష్ట్ర ఆవశ్యకతను వివరించి, ప్రజలను చైతన్యం చేశాడని ఆయన తెలిపారు. నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేశాడని అన్నారు. సంతోష్‌ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగన్న, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, అర ుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి రాయి కృష్ణ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్‌కుమార్‌,  కాకి భాస్కర్‌, సారథి కళాబృందం ఎస్‌.పాల్‌, పుష్ప, బీఎ్‌సపీ రాష్ట్ర నాయకులు పర్వతాలు, బుద్ద సత్యనారాయణ, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, గూడూరూ జానకిరాంరెడి,్డ ధర్మార్జున్‌, కామళ్ల నవీన్‌, సర్పంచ్‌ ఆదూరి పద్మ కోటయ్య, మేకల నాగేశ్వరరావు, కృష్ణ, సైదులు, నగేష్‌, జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising