ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులపై పనిభారం తగ్గించాలి

ABN, First Publish Date - 2020-12-03T05:52:17+05:30

తమకు పనిభారం తగ్గించి, వేధింపులు ఆపాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేశారు.

డిపో ఎదుట ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ రూరల్‌, డిసెంబరు 2: తమకు పనిభారం తగ్గించి, వేధింపులు ఆపాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేశారు. స్థానిక డిపో ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. లాక్‌డౌన్‌ తర్వాత కార్మికు లకు అదనపు డ్యూటీలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపి ంచారు. మహిళా కార్మికులకు రాత్రివేళల్లో కూడా డ్యూటీలు వేసి డ్యూటీ చేయకుంటే సస్పెండ్‌ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిం చారు. 8 గంటల పనివిధానం ఉండగా, 12నుంచి 15 గంటలు పనిచే యిస్తున్నారన్నారు. సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ సీఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకూర్చున్నారు. దీంతో డిపో మేనే జర్‌ రాజీవ్‌ ప్రేమ్‌కుమార్‌ వారితో మాట్లాడారు. పనిభారం తగ్గించేం దుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ధర్నా విరమించి విధుల్లో చేరారు. ఏఐటీయూసీ నాయకుడు మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ నాయకుడు ముత్యాలు ధర్నాకు మద్దతు తెలిపారు. 

Updated Date - 2020-12-03T05:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising