పేదలకు అండగా ప్రభుత్వం : చిరుమర్తి
ABN, First Publish Date - 2020-12-29T05:46:21+05:30
రాష్ట్రంలో పేదలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటోందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నకిరేకల్ / నార్కట్‌పల్లి, డిసెంబరు 28 : రాష్ట్రంలో పేదలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటోందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గంలోని చింతల శిరీషకు రూ.3లక్షలు, బట్టు శ్రవణ్, గట్టికొండ రాములుకు రూ.2లక్షల చొప్పున మంజూరైన ఎల్‌వోసీ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం అందించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పేదలను ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నా రు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో నడికుడి వెంకటేశ్వర్లు, సర్పంచ్ ప్రగడపు నవీన్‌రావు, గొర్ల వీరయ్య, రాచకొండ వెంకన్న, పల్లె విజయ్, యల్లపురెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని తొండ్లాయి గ్రామ మాజీ సర్పంచ్ చింత ప్రమీల భర్త యాదయ్య అనారోగ్యంతో మృతిచెందగా మృతదేహాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి సందర్శించి నివాళులర్పించారు.
Updated Date - 2020-12-29T05:46:21+05:30 IST