ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి
ABN, First Publish Date - 2020-12-15T06:08:39+05:30
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీతో పాటు గ్రూప్-1, గ్రూప్ -2 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ విడుదల చే యాలని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరారు.
నల్లగొండ క్రైం, డిసెంబరు 14: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీతో పాటు గ్రూప్-1, గ్రూప్ -2 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ విడుదల చే యాలని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరారు. జిల్లా కేం ద్రానికి వచ్చిన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు సోమవారం వినతిపత్రం అందజేశారు. కరోనాతో నష్టపోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న అధ్యాపకులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్వాయి రవి, గొబ్భిళ్ల అనిల్, కుత్తల ఉమా మహేశ్వర్, బీవీ చారి, రాము, నరేష్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T06:08:39+05:30 IST