ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీల అమలులో సీఎం కేసీఆర్‌ విఫలం

ABN, First Publish Date - 2020-12-02T06:01:14+05:30

భువనగిరి రూరల్‌, డిసెంబరు 1:భువనగిరి రూరల్‌, డిసెంబరు 1:చ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ అమలు చేయకుండా మాట తప్పారని జీఎంపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌ అన్నారు.

జీఎంపీఎస్‌ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

16న యాదగిరిగుట్ట నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్ర: రవీందర్‌ 

భువనగిరి రూరల్‌, డిసెంబరు 1: భువనగిరి రూరల్‌, డిసెంబరు 1:భువనగిరి రూరల్‌, డిసెంబరు 1:చ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ అమలు చేయకుండా మాట తప్పారని జీఎంపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌ అన్నారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. రెండో విడత సబ్సిడీ గొర్రెలను మంజూరులో విఫలం అయ్యారన్నారు. గొర్రెల షెడ్ల నిర్మాణానికి రూ.30లక్షల రుణాన్ని మంజూరు చేసి, యువతకు అర్థిక పరిపుష్టి కల్పించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధ్దాప్య పింఛన్‌ రూ.5వేలు, ప్రమాదవశాత్తు మృతి చెందిన గొర్రెల కాపరికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 14న యాదగిరిగుట్ట నుంచి కలెక్టరేట్‌ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో జీఎంపీఎస్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి మల్లేశం, దయ్యాల నర్సింహా, నాయకులు కె.గోపాల్‌, బుడుమ శ్రీశైలం, శ్రీను, నగేష్‌, బీరప్ప, సత్యనారాయణ, జంగయ్య, వెంకటేష్‌, రాజు, బాల నర్సింహ, యాదగిరి, పాక జహంగీర్‌, కడారి కృష్ణ, గొర్రెల, మేకల పెంపకందారులు ఉన్నారు.

Updated Date - 2020-12-02T06:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising