ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి రోజు నామినేషన్లు అంతంత మాత్రమే

ABN, First Publish Date - 2020-02-07T08:33:48+05:30

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను గురువారం జిల్లాలో 73 మంది దాఖలు చేశారు. మొదటి రోజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను గురువారం జిల్లాలో 73 మంది దాఖలు చేశారు. మొదటి రోజు జిల్లాలో నామినేషన్లు అంతంతమాత్రమే దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 608 డైరెక్టర్ల పదవులకు గానూ 73 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్లు వేయడానికి రెండు రోజులు గడువు ఉంది. ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవాలు అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలో అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి పీఏసీఎస్‌ పరిధిలో 2, నూతనకల్‌ పీఏసీఎస్‌ పరిదిలో 3, సర్వారంలో 1, తాడువాయిలో 4, తెల్లబెల్లిలో 2, నడిగూడెంలో 8, కోదాడలో 7, అనంతగిరిలో 5, చిమిరియాలలో 1, కాపుగల్లు 1, ఎర్రారంలో 2, కందిబండలో 3, మఠంపల్లిలో 4, లింగగిరిలో 8, బేతవోలులో 3, గరిడేపల్లి మండలం రాయినిగూడెంలో 7, పాలకీడులో 4, చిల్లెపల్లిలో 1, పెంచికల్‌దిన్నెలో 1, గరిడేపల్లిలో 4, చీదెళ్లలో 1, నారాయణగూడెంలో 1 నామినేషన్లు దాఖలయ్యాయి.

Updated Date - 2020-02-07T08:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising