ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా వైరస్‌

ABN, First Publish Date - 2020-08-03T11:00:59+05:30

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. పల్లె,పట్టణం తేడా లేకుండా కేసులు నమోదవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి జిల్లాలో 93 పాజిటివ్‌


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 2: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. పల్లె,పట్టణం తేడా లేకుండా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉమ్మడి జిల్లాలో 93 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. నల్లగొండ జిల్లాలో 46, సూర్యాపేటలో 35, యాదాద్రి జిల్లాలో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీ పద్మానగర్‌ కాలనీకి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చింది. ఆమె భర్తకు కూడా ఇటీవల పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా హను మాన్‌వాడలోని ఒకరికి పాజిటివ్‌ రాగా, హైదరాబాద్‌ తరలించారు. 


పెన్‌పహాడ్‌ మండలంలోని అనంతారం గ్రామంలో ఆశవర్కర్‌కు పాజిటివ్‌వచ్చింది.


వలిగొండ మండంలోని పొద్దటూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌ తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


చౌటుప్పల్‌ పట్టణానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో ఒకరు డెంటల్‌ వైద్యుడు.


మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు నెగటివ్‌ రిపోర్ట్‌ రావడంతోపాటు రెండు రోజుల్లో హోంక్వారంటైన్‌ ముగుస్తుందని ఆయన కుమారుడు, ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నల్లమోతు సిద్ధార్థ తెలిపారు.


కరోనా నివారణకు గుర్రంపోడు మండలంలోని కొప్పోలులో 350 కుటుంబాలకు విశ్వహిందు పరిషత్‌ భజరంగ్‌దళ్‌ హోమియోపతి మందులు పంపిణీ చేసింది.

Updated Date - 2020-08-03T11:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising