ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వేదికలను త్వరగా పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2020-09-22T07:16:41+05:30

జిల్లాలో రైతువేదికల నిర్మాణా లను త్వరగా పూర్తిచేయాలని త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి 


నాగారం/ అర్వపల్లి, సెప్టెంబరు 21: జిల్లాలో రైతువేదికల నిర్మాణా లను త్వరగా పూర్తిచేయాలని త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. నాగారం మండల కేంద్రంలో రైతువేదిక భవన నిర్మాణాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో రైతు వేదికలు, ప్రకృతివనాలతో పాటు శ్మశాన వాటికల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు నాగారంలో ఇప్పటివరకు స్థలాన్ని సేకరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.


అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీ లించారు. నాగారం తహసీల్దార్‌ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడు తూ ప్రభుత్వ భూములను అక్రమార్కులకు పట్టాలు చేశారని, మండలంలోని వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆకుల ప్రతాప్‌ కలెక్టర్‌కు విన్నవించారు. విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆయనవెంట ఆర్‌డీవో రాజేంద్రకుమార్‌, ఎమ్మార్వో శ్రీకాంత్‌ ఉన్నారు. అనంతరం అర్వపల్లి మండల పరిధిలోని రామన్నగూడెంలో రైతు వేదిక నిర్మాణ  పనులను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఏఈ అశోక్‌, తహసీల్ధార్‌ హరిచందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T07:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising