ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులు తీర్చలేక కౌలు రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-29T05:47:54+05:30

సాగుకోసం చేసిన అప్పులు భారమై యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ కౌలు రైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలిగొండ, డిసెంబరు 28: సాగుకోసం చేసిన అప్పులు భారమై యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ కౌలు రైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి  చెందిన బొడ్డు స్వామి(40) అదే గ్రామానికి చెందిన కొమ్మిడి మోహన్‌రెడ్డి వద్ద ఎనిమిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, రెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలం పంటలో నాలుగు ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో వరిని, ఒక ఎకరం పశుగ్రాసం సాగు చేశాడు. అధిక వర్షాలకు పత్తి దిగుబడి రాలేదు. దానికి తోడు వరి పైరు కూడా దెబ్బతిన్నది. సాగుకు రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. ఈ అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం పొలంలో పశువుల పాకలో ఉన్న దూలానికి ఉరి వేసుకున్నాడు. పొలం వద్దకు వెళ్లిన భార్యకు స్వామి విగతజీవుడై కనిపించాడు. స్వామి భార్య శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2020-12-29T05:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising