ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి

ABN, First Publish Date - 2020-06-06T09:51:22+05:30

ప్రకృతిని కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా న్యాయమూర్తి రమేష్‌


నల్లగొండ టౌన్‌ / దేవరకొండ టౌన్‌ / వేములపల్లి / త్రిపురారం / నల్లగొండ కల్చరల్‌ /  నల్లగొండ రూరల్‌, జూన్‌ 5 : ప్రకృతిని కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా న్యాయమూర్తి రమేష్‌ కోరారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక కోర్టు సముదాయంలో మొక్కలు నాటి మాట్లాడారు. నాటిన మొక్కలను దత్తతగా తీసుకుని సంరక్షించడంతో పాటు, పర్యావరణ చట్టాలను విధిగా పాటించాలని సూచించారు.


దేవరకొండ పట్టణంలోని స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆవరణలో అధ్యక్షుడు ఎన్‌వీటీ  మొక్కలు నాటి మాట్లాడారు. వేములపల్లి మండలంలోని ఎరుకలగుట్ట గ్రామంలో నెహ్రూ యువజన కేంద్రం, నల్లగొండ నేషనల్‌ యూత్‌ వలంటీర్‌ నామ సైదులు ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. త్రిపురారం మండల కేంద్రంలో తెలంగాణ ఇండిపెండెంట్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నల్లగొండ పట్టణంలోని 34వ వార్డులోని  ఆలయ ఆవరణ, ఇతర ప్రాంతాల్లో  కౌన్సిలర్‌ రావిరాల పూజితవెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. పర్యావరణ సమితి ఆధ్వర్యంలో పట్టణలోని స్థానిక ఎఫ్‌సీఐ గోదాంల వద్ద వనోత్సవంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్‌డీవో పీడీ శేఖర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మొక్కలు నాటారు. 

Updated Date - 2020-06-06T09:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising